Home  »  TV News  »  కావ్య అవసరాల కోసం డబ్బులు ఇవ్వాలనే రాజ్ ప్లాన్ నెరవేరుతుందా?

Updated : Jul 11, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -144 లో.. అప్పుని కళ్యాణ్ పోలీస్ స్టేషన్ నుండి విడిపిస్తాడు. అందరు కలిసి కనకం ఇంటికి బయల్దేరుతారు. కళ్యాణ్ కి కనకం కాఫీ చేస్తుంది. ఇది తీసుకొని వెళ్లి కళ్యాణ్ కి ఇవ్వమని అప్పుకి కాఫీ ఇస్తుంది కనకం. నాకు ఇవన్నీ సెట్ కావు.. నాకేమైనా పెళ్లి చూపులు జరుగుతున్నాయా? వెళ్లి నువ్వే ఇవ్వమని అప్పు అంటుంది. అయిన వినకుండా కనకం కాఫీని అప్పుతో పంపిస్తుంది. అప్పు కాఫీ తీసుకొని వస్తుంటే కళ్యాణ్ షాక్ అవుతాడు. ఏంటి నువ్వు తీసుకోని వస్తున్నావా అని కళ్యాణ్ అంటాడు. ఆ తరువాత కళ్యాణ్, అప్పు ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. 

మరొక వైపు తన దగ్గర కొంత డబ్బు ఉంచుకోమని ఎలా చెప్పాలని చేతిలో డబ్బులు పట్టుకొని రాజ్ ఆలోచిస్తాడు. అప్పుడే కావ్య వస్తుంది. ఏంటి చేతిలో డబ్బులు.. మీ అమ్మా నేను చేసిన సాయానికి థాంక్స్ చెప్పింది. మీరు డబ్బుతో థాంక్స్ చెపుదాం అనుకుంటున్నారా? మానవత్వానికి వెల కడుతున్నారా అని కావ్య అనేసరికి.. ఇప్పుడు ఈ డబ్బు ఇస్తే ఇలాగే అనుకుంటుందని ఫోన్ లో రాజ్ వాళ్ళ బాబాయ్ తో మాట్లాడినట్లు మాట్లాడతాడు రాజ్. ఆ తర్వాత డబ్బు ఇక్కడ పెడుతున్నాను నీకు అవసరం ఉంటే యూజ్ చేసుకోమని  కావ్యకి  రాజ్ చెప్తాడు.

మరొక వైపు అప్పుకి  తన ఫ్రెండ్ కాల్ చేసి రమ్మంటాడు. అప్పు వెళ్తుంటే కనకం అడ్డుపడుతుంది. ఇప్పుడు నువ్వు వెళ్లి మళ్ళీ ఏ గొడవ పెట్టుకోకు నువ్వు అమ్మాయివనే విషయం మర్చిపోకని కనకం అంటుంది. "మనకు గుర్తుందా అప్పు అమ్మాయి అనే విషయం" అని కనకంతో అప్పు వాళ్ళ పెద్దమ్మ అంటుంది. తనకి పెళ్లి వయసు వచ్చింది. మనం దాని గురించి ఆలోచిస్తున్నామా అని అప్పు వాళ్ళ పెద్దమ్మ అంటుంది. నువ్వు అలాంటి విషయం ఇప్పుడు మాట్లాడకని అప్పు అంటుంది. ఆ తరువాత కనకం కళ్యాణ్ కి ఫోన్ చేసి కావ్యకి ఫోన్ ఇవ్వమంటుంది. అత్తారింట్లో తను ఎలా ఉందో కనకం కనుక్కుంటుంది. నేను బాగున్నాను అమ్మా.. ఏదైనా నేను ఇక్కడ చూసుకోగలనని కావ్య అంటుంది.

మరొక వైపు కావ్యకి బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయించడానికి బ్యాంకు నుండి ఎగ్జిక్యూటివ్ ని ఇంటికి రమ్మంటాడు రాజ్. అతను ఇంటికి వస్తాడు. ఎక్కడ కావ్య కోసం రప్పించానని అందరికి తెలిస్తే ఏమైనా అనుకుంటారేమోనని అందరికి అకౌంట్ ఓపెన్ చెయ్యడానికి రప్పించానని రాజ్ చెప్తాడు. ఒక్కొక్కరిగా అందరు తమ వివరాలని ఎగ్జిక్యూటివ్ కి చెప్తారు. కావ్య మాత్రం అక్కడ ఉండదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.